Category: తెలంగాణ | 30 Apr 2025, 07:45 AM
స్పైడర్, వరంగల్ ప్రతినిధి : ఉత్తర తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరు గాంచిన వరంగల్ భద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 29న ప్రారంభమైన ఉత్సవాలు బుధవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. తొలిరోజు జరిగిన వేడుకలకు మున్నురు కాపు సంఘం నేతలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు, కల్యాణతంతుకు సంబంధించిన సామాగ్రిని తీసుకువచ్చారు. ఈనెల 29న మొదలైన ఉత్సవాలు... మే 10 వరకు కొనసాగనున్నాయి. 12 రోజుల పాటు కొనసాగే ఈ వేడుకులకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.