ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

ఇప్పుడు వార్..సరిపెట్టుకోండి.. మన మిస్సైల్ ను తర్వాత విడుదల చేద్దాం
Share this post

Category: సినిమా | 17 May 2025, 06:17 PM


జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న రెండు పాన్ ఇండియా మూవీస్‌... వార్ -2, డ్రాగ‌న్ సినిమాల అప్‌డేట్స్ కోసం తార‌క్ అభిమానులు ఇగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌తో తెరకెక్కిస్తున్న వార్‌-2 (war 2), ప్రశాంత్‌ నీల్‌తో చేస్తున్న డ్రాగన్‌ (Dragon) చిత్రాల నుంచి బర్త్‌డే అప్‌డేట్స్‌ వస్తాయని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే విచిత్రంగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్‌ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్‌ ఉండదంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ (mythri Movie makers) తాజాగా ట్వీట్‌ చేసింది. ‘‘ఇది పూర్తిగా ‘వార్‌ 2’ టైమ్‌.. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు.. దీన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం. మన మాస్‌ మిస్సైల్‌ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈసారి తారక్‌ పుట్టినరోజును ‘వార్‌ 2’తో చేసుకోండి’’ అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టింది మైత్రీ సంస్థ. సో.. ఈసారి తారక్‌ పుట్టినరోజుకు డ్రాగన్‌ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదని అర్థమవుతోంది.

Related Posts

స్పిరిట్ షూటింగ్‌పై క్లారిటీ.. ఆ సినిమా క‌న్నా ముందే
స్పిరిట్ షూటింగ్‌పై క్లారిటీ.. ఆ సినిమా క‌న్నా ముందే
Read More
2025 © Copyright kaakateeyaspider. All rights reserved.