Category: క్రీడలు | 02 May 2025, 03:36 PM
గబ్బర్ సింగ్.. శిఖర్ ధావన్‌కు ఎట్టకేలకు ఓ అందమైన ఐర్లాండ్ అమ్మాయి.. గర్ల్ ఫ్రెండ్‌గా దొరికేసినట్లుంది. గత కొద్దిరోజులుగా ధావన్ ఐర్లాండ్‌కు చెందిన సోఫితో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. ఇన్‌స్టాలోనూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను పోస్టు చేస్తుండటం విశేషం. 2025 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా తొలిసారిగా సోఫితో కనిపించిన శిఖర్ ధావన్.. ఈ తర్వాత అనేక సార్లు ఆమెతో ప్రేమ ప్రయాణాలు సాగించినట్లుగా నెట్టింట్ల చర్చ జరుగుతోంది. అనేక మీడియా సంస్థలు ఆ మహిళ సోఫీ షైన్ అని, ఆమె ఐర్లాండ్‌కు చెందిన యువతి అని పేర్కొంటున్నాయి. అయితే, శిఖర్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్రమంలో కీలక విషయాలను ప్రస్తావించారు. యాంకర్ శిఖర్ గర్ల్‌ఫ్రెండ్ గురించి అడిగినప్పుడు, మొదట అతను సమాధానం చెప్పడానికి సంకోచించాడు. కానీ తర్వాత నవ్వుతూ ఇలా అన్నాడు. నేను ఎవరి పేరూ చెప్పను. కానీ ఈ రూమ్‌లో అతి అందమైన అమ్మాయి నా గర్ల్‌ఫ్రెండ్ అన్నారు.