Category: తాజా వార్తలు | 30 Apr 2025, 08:13 AM
పిడుగులతో దద్దరిల్లిన వరంగల్
స్పైడర్, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలో బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులుతో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 7:45 నిముషాలకు ఒక్కసారిగా మొదలైన వాన.. దాదాపు అర్ధగంట పాటు కురిసిన వర్షంతో నగరం అతలాకుతలమైంది. తీవ్రమైన గాలులు వీయడంతో నగరంలో అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అనేక చోట్లా పిడుగులు పడ్డాయి.