Category: అంతర్జాతీయం | 22 Apr 2025
స్పైడర్, తెలంగాణ బ్యూరో : అంతన్నడు.. ఇంతన్నడు సింగరాజు.. అన్నపాట సాత్రంగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి. అధ్యక్ష పదవిబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అటు అమెరికా పౌరుల నుంచి ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రధాన వాణిజ్యపరమైన అంశాల్లో అమెరికాతో వ్యాపార వాణిజ్య ఒప్పందాల మేరకు ఎగుమతి, దిగుమతుల్లో సుంకాలను భారీగా పెంచేస్తున్న విషయం తెలిసిందే. అందులో భారత్, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, వంటి ఎన్నో దేశాలు ఇప్పుడు వ్యాపార లావాదేవీల విషయంలో అమెరికాతో తెగదెంపులు చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే ప్రపంచ దేశాలన్ని కూడా అమెరికాను కొల్లగొడుతున్నాయనే రీతిలో ఆయన వ్యవహరిస్తుండటం గమనార్హం. అయితే ఇలా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చైనా గట్టి దెబ్బ కొట్టేసింది. అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా చైనా నుంచి ఎగుమతయ్యే ముడిసరుకులపై ఆదేశం భారీగా సుంకాలను పెంచేయడం గమనార్హం. అమెరికాకు ఎగుమతి అయ్యే అత్యంత అరుదైన ఖనిజాలను ఆపేయాలని చైనా నిర్ణయించింది. ఇవి అమెరికాలో ఎలక్ట్రానిక్స్ , యుద్ధ పరికరాలు సహా అనేక కీలక వస్తువుల తయారీలో కీలకం. ఇవి లేకపోతే అమెరికాకు కష్టంగా మారుతుంది. ఇవి మాత్రమే కాదు..ఇంకా చాలా .. చైనాలో మాత్రమే లభ్యమయ్యే వస్తువుల ఎగుమతుల్ని చైనా ఆపేయాలని అనుకుంటోంది.
పెద్ద డీల్ కుదురుతుందంటున్న అమెరికా
పరిస్థితులు రివర్స్‌లో మారుతున్నట్లుగా కనిపిస్తూండటంతో పెద్ద డీల్ కుదురుతుందని.. అమెరికా ఆశ పడుతోంది. గతంలో చాలా దేశాలు ట్రంప్ వేసిన సుంకాలపై చర్చలకు సిద్ధమని ప్రకటించాయి. కానీ చైనా మాత్రం రివర్స్ సుంకాలతో.. కొరడా ఝుళిపించింది. ఎగుమతుల్ని ఆపేసింది. దీంతో అమెరికానే.. చైనాతో చర్చలకు సిద్ధమని అంటోంది. ఇప్పుడు చైనాకు తల వంచినట్లయింది. ఈ పరిస్థితి అమెరికానే తెచ్చుకుంది. ట్రంపే తెచ్చి పెట్టారు.