Category: తెలంగాణ | 22 Apr 2025
స్పైడర్, తెలంగాణ బ్యూరో : బిల్లులు క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేసిన శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఏసీబీకి చిక్కాడు. శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విప్పెర్ల శ్రీనివాస్ చార్మినార్‌జోన్ కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. చార్మినార్ జోన్‌పరిధిలో మొక్కలు నాటించిన కాంట్రాక్టర్‌కు రూ.44 లక్షల బిల్లులు రావాల్సి ఉండగా, బిల్లులు క్లియర్ చేయాలంటే రూ.2.20 లక్షల లంచం డిమాండ్ చేశాడు. పలు దఫాలుగా కాంట్రాక్టర్‌నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. మిగతా మొత్తానికి కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకురావడంతో... తాళలేక సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం కాంట్రాక్టర్ నుంచి 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు